ఢీ అంటే ఢీ అంటున్న శాస్త్రీ,గంగూలి

ఇద్దరు భారత జట్టు మాజీ అగ్రశ్రేణి ఆటగాళ్ల మధ్య  కోల్డ్ వార్ తీవ్ర రూపం దాలుస్తోంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లయిన రవిశాస్త్రి, సౌరవ్ గంగూలిల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటోంది. రవి శాస్త్రీ భారత్ లోని అత్యున్నత క్రికెట్ జట్టు కెప్టెన్లలో గంగూలి పేరును చేర్చకపోవడంతో పాటుగా ధోనీ ని దాదా గా పిలవడం కూడా వీరి మద్య ఉన్న వైరానికి అద్దం పడుతోంది. దాదా గా క్రికెట్ ప్రపంచం గంగూలిని పిలుస్తారు. అయితే రవి శాస్త్రి మాత్రం ధోనీని దాదా గా పేర్కొనడం వీరి మధ్య ఉన్న వైరుద్యాలను మరోసారి బరిర్గతం చేసింది.
చాలా కాలం నుండి రవిశాస్త్రీ, గంగూలి క్రికెట్ రాజకీయాల్లో వేర్వేరు గ్రూపుల్లో ఉన్నారు. భారత క్రికెట్ జట్టు కోచ్ పదవి కోసం రవిశాస్త్రి తీవ్రంగా పోటీ పడ్డారు. ఆయన ఎంపిక దాదాపుగా ఖాయం అయిపోయిందన్న వార్తలు కూడా వచ్చిన సమయంలో భారత క్రికెట్ జట్టు కోచ్ పదవిని ఎంపిక చేయడం కోసం గంగూలి నేతృత్వంలో ఒక కమిటీ ని నియమించారు. ఈ కమిటీ కోచ్ పదవికి రవిశాస్త్రిని పక్కన బెట్టి అనీల్ కుంబ్లేను ఎంపికచేసింది. దీనిపై రవిశాస్త్రి  సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేశారు.  గంగూలి కావాలని తనను కోచ్ కాకుండా అడ్డుకున్నారని రవి శాస్త్రి మాజీ క్రికెటర్ గంగూలి పై వైరం పెంచుకున్నారు. ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటూ ఒకరిపై ఒకరు సెటైర్ లు వేసుకుంటున్నారు. రవిశాస్త్రికి డబ్బు యావ తప్ప భారత క్రికెట్ కు సేవచేయాలనే ధ్యాస లేదని గంగూలి సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన వార్తలు కూడా ఇద్దరి మధ్య వైరాన్ని మరింత పెంచాయి. తాజాగా దానికి కౌంటర్ గా భారత అగ్రశ్రేణి కెప్టెన్ల లిస్టులో గంగూపి పేరును చేర్చకపోవడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *