ఇక బినామీ ఆస్తుల వంతు:వెంకయ్య

 
పెద్ద నోట్ల రద్ద తరువాత ఇక బినామీ అస్తులపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించనుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. “ఈ-పరిపాలన” పై విశాఖపట్నంలో జరుగుతున్న సమావేశంలో మాట్లాడిన వెంకయ్య రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. దేశ ప్రజలందరి హితం కోసమే ప్రధాని మోడి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. దేశ సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉందని అన్నారు. పన్నులు కట్టకుండా తప్పించుకుని తిరిగుతున్న వారందరి చేత పన్నులు కట్టించడమే తమ లక్ష్యమని చెప్పారు. బీనామీ అస్తులు పోగు చేసుకుంటూ దేశ అబివృద్ధికి ఆటంకంగా మారిన వారిని ఎవరినీ విడిచిపెట్టేది లేదని వెంకయ్య చెప్పారు. బినామీ ఆస్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
దేశంలో అవినీతిని రూపమాపడంతో పాటుగా పెద్ద ఎత్తున పేరుకుని పోయిన నల్లధనాన్ని వెలికితీయడం కోసం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భారత ప్రజలందరూ తమ మద్దతును ప్రకటిస్తున్నారని అవినీ, నల్లధనంపై ప్రధాని చేస్తున్న పోరాటానికి బాసటగా నిలుస్తున్నారని చెప్పారు. పారదర్శక లావాదేవీలవైపు ప్రజలు మళ్లుతున్నారని అన్నారు. ప్రతీ ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు ఉండి నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తే మనకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందన్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత బ్యాంకుల్లోకి పెద్ద మొత్తంలో నిధులు వచ్చి చేరాయని అప్పుడు తక్కువ వడ్డీలకే బ్యాంకులు రుణాలు ఇచ్చే పనిలో పడ్డాయని దీని వల్ల పేద, మద్య తరగతి ప్రజలు మరింత లాభపడతారని చెప్పారు. భారత్ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుని పోతోందని దీన్ని ప్రధాని లేదా ఆయన మంత్రి వర్గ సహచరులే కాదు రేటింగ్ సంస్థలే కూడా నిర్థారిస్తున్న విషయాన్ని గుర్తు పెట్టాకోవాన్నారు. పెద్ద పెద్ద నిర్ణయులు తీసుకున్నప్పటు చిన్న చిన్న సమస్యలు వస్తాయని ఆయినా వాటిని అధికమించి మంచి భవిష్యత్తుకోసం పనిచేస్తున్నమని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *