బంకుల్లో యధావిధిగా కార్డుల వినియోగం

పెట్రోల్ బంకుల్లో ఉపయోగించే కార్డులపై సర్వీస్ ట్యాక్స్ ను విధించాలనే నిర్ణయం పై బ్యాంకులు వెనక్కి తగ్గాయి. దీనితో పెట్రోల్ బంకుల్లో యధావిదిగా కార్డులను ఉపయోగించుకునే అవకాశం కలిగింది. పెట్రోల్ బంకుల్లో కార్డులను వియోగిస్తే దానిపై సర్వీస్ ట్యాక్స్ ను విధిస్తున్నట్టు బ్యాంకులు ప్రకటించడంతో పెట్రల్ బంకుల్లో కార్డుల ద్వారా పెట్రోల్ పోసేది లేదని పెట్రోల్ బంకుల యజమాన్యాలు స్పష్టం చేశాయి. దీనిపై పెద్ద ఎత్తున అలజడి రేగడంతో బ్యాంకులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. దీనితో తాత్కాలికంగా తమ నిరసనను వాయిదా వేస్తున్నట్టు పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ప్రకటించాయి.
పెట్రోల్ బంకుల్లో కార్డుల వినియోగంపై సర్వీస్ ట్యాక్స్ నిర్ణయాన్ని నాలుగైదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు బ్యాంకులు ప్రకటించాయి. ఈ లోగా పెట్రలో బంకుల యాజమాన్యాల సంఘంతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామని బ్యాంకు వర్గాలు వెళ్లడించాయి. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దరిమిలా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో కార్డుల ద్వారా జరిపే లావాదేవీలపై ఎటువంటి రుసులు విధించవద్దని ఆర్థిక శాఖ బ్యాంకులను కోరింది. ఈ మేరకు బ్యాంకులు ఎటువంటి ట్యాక్యులు విధించడం లేదు . అయితే తమ నిర్ణయం ప్రకటించి 50 రోజులు పూర్తయినందున తిరిగి సర్వీస్ ట్యాక్స్ ను విధించనున్నట్టు బ్యాంకులు ప్రకటించడంతో దుమారం రేగింది. తమపై భారం మోపే విధంగా బ్యాంకులు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పెట్రోల్ బంకుల్లో కార్డుల వినియోగాన్ని నిలిపివేస్తున్నట్టు పెట్రోల్ బంకు డీలర్లు ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ వివాదం సర్ధుమణిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *