దంగల్ కు పోగట్ సిస్టర్స్ దూరం

ప్రో రెజ్లింగ్ లీగ్ లో పోగట్ సిస్టర్స్ కొనసాగేది అనుమానంగా మారింది. గీత జ్వరంతో బాధపడుతుందడా బబిత గాయంతో బాధపడుతోంది.  వీరిద్దరు ప్రో రెజ్లింగ్ లీగ్ లో ఉత్తర్ ప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన దంగల్ సినిమా ఈ సోదరీమణులదే కావడంతో వారికి ఇటీవల విపరీతమైన క్రేజ్ పెరిగింది. వీరు హజరయ్యే మ్యాచ్ లతో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా భారీ విజయం సాధించడంతో పోగట్ సిస్టర్స్ కు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నాలు దెబ్బతినడంతో ప్రోలీగ్ నిర్వహాకులు కూడా ఆందోళన చెందుతున్నారు. వీరి స్థానాల్లో ఇతరులను తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని భారత రెజ్లింగ్‌ సమాఖ్యను కోరినట్టు తెలుస్తోంది. మహిళల 53 కిలోల విభాగంలో బబిత స్థానంలో పింకి, 58 కిలోల విభాగంలో గీత స్థానంలో మనీషా పేర్లను సూచించారు. కాగా జట్టు నుంచి గీత, బబిత వైదొలగరని, టోర్నీలో వారు జట్టుతో కలసి ఉంటారని, అయితే తదుపరి పోటీలలో పాల్గొనకపోవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *