దేశ సాంసృతిక వాసులు ఎన్నారైలు:మోడీ

పదీంతోపాటు పర్సన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌ (పీఐవో)కార్డులను ఓవర్సీస్‌ ఇండియన్‌ సిటిజన్‌ కార్డులుగా మార్చుకునే సదుపాయాన్ని పొడిగించారు. బెంగళూరులో జరుగుతున్న 14వ ప్రవాస భారతీయ దివస్‌లో ప్రధాని మోడి ఈ విషయాన్ని ప్రకటించారు.ఎటువంటి జరిమానా లేకుండా డిసెంబర్‌ 31నుంచి జూన్‌ 30 వరకు వీటిని మార్పించుకోవచ్చని తెలిపారు.  ప్రవాస దివస్ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ప్రస్తుతం భారత్‌ నుంచి మేధోవలసను ఆపి ఆ మేథస్సును దేశమే ఉపయోగించుకునే దిశగా ఆలోచిస్తోందన్నారు.ప్రవాసభారతీయులు దేశ సంస్కృతి సంప్రదాయాలకు రాయబారులని అన్నారు. వారికి సాధ్యమైనన్ని సదుపాయాలు కల్పించాడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. పెద్ద మొత్తంలో విదేశాల నుండి భరత్ కు విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తున్న ఎన్.ఆర్.ఐ లు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ప్రతీ సంవత్సరం 4.70 లక్షల కోట్ల రూపాయలను స్వదేశానికి పంపుతూ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగపస్తున్నారంటూ కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *