ఇప్పటికీ అదే గ్రేస్… అదే జోష్

     చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ పంక్షన్ విజయవాడ సమీపంలో అట్టహాసంగా జరిగింది. అభిమానుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో చిరు అభిమానులు హాజరయ్యారు. ప్రేక్షకుల ప్రేమ వల్లే తాను తిరిగి వారి ముందుకు వస్తున్నానని అన్నారు. అభిమానుల ఆదరణ చూసిన తరువాత తనకు మాటలు రావడం లేదన్నారు. ‘‘రాననుకున్నారా? రాలేననుకున్నారా? దిల్లీకి పోయాడు. డ్యాన్స్‌లకు దూరమైపోయాడు. హస్తినాపురానికి పోయాడు హాస్యానికి దూరమైపోయాడు.. ఈ మధ్య కాలంలో మా మధ్యన లేడు.. అందుకు మాస్‌కు దూరమైపోయాడు.. అనుకున్నారా? అదే మాస్‌.. అదే గ్రేస్‌.. అదే హోరు.. అదే జోరు. అదే హుషారు  అని చిరు చెప్పిన డైలాగ్ కు అభిమానుల నుండి భారీ స్పందన వచ్చింది. . ఈ సినిమా అనగానే నాకు వెంటనే వి.వి.వినాయక్‌ మాత్రమే గుర్తొచ్చారు. వినాయక్‌ను ఎంచుకోవడమే మాకు తొలి విజయం. నిజంగా చరణ్‌ చెప్పినట్లు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. చరణ్‌ ‘ధృవ’ సినిమా చేస్తూనే ఎక్కడా వృథా అనేది లేకుండా నిర్మాణ బాధ్యతలు చేపట్టినందుకు ఎన్ని ధన్యవాదాలు తెలిపినా తక్కువే అన్నారు.  ప్రతీ టెక్నిషియన్‌ నన్ను కొత్తగా చూపించడానికి ప్రయత్నించారు. రామ్‌చరణ్‌ సమర్థ నిర్మాతగా అవతారం ఎత్తుతాడని వూహించలేదు. చరణ్‌కు నటుడిగా హద్దులూ తెలుసు.. నిర్మాతగా పద్దులూ తెలుసు. భవిష్యత్‌లో మంచి నటుడిగానే కాకుండా నిర్మాతగా స్థిరపడతాడని ఆశిస్తున్నన్నారు. ఈ చిత్రానికి పేరు సూచించిన దాసర నారాయణ రావుకు చిరు కృతజ్ఞతలు చెప్పారు. తాను సినిమాలను విడిచిపెట్టి అప్పుడే పది సంవత్సరాలు అయిపోయాయని ఈ పది సంవత్సరాలు చాలా త్వరగా గడిచిపోయినట్టుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *