వేయి రూపాయలకే విమాన టికెట్

 
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా భారీ డిస్కౌంట్లతో ఆఫర్ ప్రకటించింది. ఈ ధరలు వెయ్యి రూపాయల నుండి ప్రారంభం అవుతున్నాయని ఎయిర్ ఇండియా ప్రకటించింది. మూడు నెలల కాలపరిమితి ఉండే ఈ టికెట్ల ధర సెకండ్ ఏసీ టికెట్ ధరతో సమానంగా వసూలు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. జనవరి 6 నుంచి ఏప్రిల్‌ 10 మధ్య తీసుకున్న టికెట్లతో జనవరి 26 నుంచి ఏప్రిల్‌ 30 మధ్య ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలిపింది. ఎయిరిండియా వెబ్‌సైట్‌తో పాటు ఎయిర్‌లైన్‌ టికెట్‌ విక్రయ కేంద్రాలు, ట్రావెల్‌ ఏజెంట్ల వద్ద కూడా ఈ టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఎయిర్ ఇండియా ప్రకటించిన ఈ ఆఫర్ తో ఇతర విమాన సంస్థలు కూడా రేట్లను తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *