త్వరలో రోజూ నీళ్లు

నగరవాసులకు తీపి కబురు… ప్రస్తుతం రోజు విడిచి రోజు నల్లా నీళ్లు వస్తుండగా ఇక నుండి రోజు తాగునీటిని అందచేసేందుకు జలమండలి సిద్ధపడుతోంది. రోజూ మంచినీటి విడుదలకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ జలమండలి అధికారులకు సూచించారు. ఈ మేరకు కావాల్సిన వనరులపై ఒక నివేదిక రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో మంచి నీటి కొరతను నివారించాడానికి చేయాల్సిన పనులపై జల మండలి అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. నగరంలో ప్రస్తుతం రోజు విడిచి రోజు మంచి నీరు వస్తుండగా శివార్లలో పరిస్థితి దారుణంగా ఉంది. శివార్లలో మూడు, నాలుగు రోజులకు ఒకసారి కానీ నీళ్లు రావడం లేదు. ఈ పరిస్థితిని మార్చడానికి కసరత్తులు జరుగుతున్నాయి. త్వరలో హైదరాబాద్ లో 24 గంటల పాటు నీళ్లు అందుబాటులో ఉండేలా చూడడానికి జలమండలి కసరత్తులు చేస్తోంది. ముఖ్యమంత్రి  కేసీఆర్ కలగా చెప్పే 24 గంటల నీటి సరఫరాకు అవసరమైన ఏర్పాట్లను చేయడానికి జలమండలి ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అయితే ఇప్పటికిప్పుడు 24 గంటల నీటి సరఫరా సాధ్యం కాదని అధికారులు చెప్తున్నారు.
ఇప్పటికీ హైదరాబాద్ కు సరఫరా అవుతున్న నీటికి డిమాండ్ కు భారీ వ్యత్యాసం ఉంది. ఈ గ్యాప్ ను తగ్గించడంతో పాటుగా నీటి సరఫరాలో ఉన్న లోటు పాట్లను అధికమిస్తే భారీగా నీటిని ఆదా చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం నీటి సరఫరా ఉన్న లోపాల కారణంగా వృద్ధా అవుతున్న నీటిని ఆదా చేసుకోగలిగితే కొంత మేరకు నీటి కొరత తీరే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *