సీనియర్ బాలీవుడ్ నటుడు ఓంపురి కన్నుమూశారు. ఆయనకు 66 సంవత్సరాలు. శుక్రవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో ముంబయిలోని సృగృహంలోనే ప్రాణాలు విడిచారు. ఎక్కువగా కమర్షియల్ సినిమాల కన్నా ఆఫ్ బీట్ సినిమాలలో ఎక్కువగా కనిపించే ఓం పూరీ తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. అద్భుత నటనతో ఆయన పలుసార్లు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఓంపురి హర్యానాలోని అంబాలా ప్రాంతంలో పంజాబీ కుటుంబంలో అక్టోబర్ 18, 1950లో జన్మించారు. పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూల్ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.1976లో మరాఠీ చిత్రం ‘ఘాశీరామ్ కొత్వాల్’తో సినీరంగ ప్రవేశం చేశారు. 1982లో ‘అరోహణ్’, 1984లో ‘అర్ధ్ సత్య’ చిత్రాలకు గానుఆయన జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ పురస్కారం పొందారు. తెలుగులో ‘అంకురం’ చిత్రంలో నటించారు. తన నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన ఓంపురి మరణంతో బాలీవుడ్ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.