ఐఐటిలో చదువు… విదేశాల్లో ఉద్యోగం… ఇదీ చాలా మంది తల్లిదండ్రులు, యువకుల కల అయితే ఇటీవల కాలంలో విదేశాల్లో ఉద్యోగానికన్నా స్వేదేశమే మిన్న అంటున్నారు ఐఐటిల్లో చదువుకున్న విద్యార్థలు. ముఖ్యంగా 2000 సంవత్సరం తరువాత పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. అంతకు ముందు చదివిన విద్యార్థుల్లో 58 శాతం మంది విద్యార్థులు విదేశాల్లో స్థిరపడగా ఆ తరువాత విదేశాల్లో స్థిరపడిన వారి సంఖ్య కేవలం 15 శాతం మాత్రమే. ముంబాయి ఐఐటీలో చదివిన విద్యార్థుల పై ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. విదేశాల్లో స్థిరపడడం కన్నా స్వదేశంలోనే ఉండటానికి ఐఐటియన్లు మక్కువ చూపెడుతున్నారు.
ప్రధానంగా 2000 సంవత్సరం నుండి భారత్ లో మౌళిక వసతులు గణనీయంగా పెరగడంతో పాటుగా అవకాశాలు పుష్కలంగా లభిస్తుండడంతో పాటుగా మంచి జీతాలు కూడా వస్తుండడంతో విదేశాలకు వెళ్లడం కన్నా భారత్ లోనే ఉండడం మేలని ఐఐటియన్లు భావిస్తున్నారు. ఈ కారణంగా విదేశాలకు ఎగిరిపోతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పలు విదేశీ కంపెనీలు భారత్ లో తమ శాఖలను నెలకొల్పడం కూడా ఐఐటి చదివిన వారు విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోవడానికి కారణంగా కనిపిస్తోంది.