బెంగళూరు లైంగిక దాడి కేసులో ఇద్దరి అరెస్ట్

 
బెంగళూరులో డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఒక యువతిపై దారుణంగా లైంకిక దాడికి దిగిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు ఘటనల పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండడంతో స్పందించిన పోలీసులు యువతిని వేధించిన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. వారిలో ఒకరు సదరు యువతి తరచూ వెళ్లే దుకాణంలో పనిచేసేవాడని తేలింది. డిసెంబర్ 31వ తేదీన రాత్రి ఇంటికి వెళుతున్న యువతిని పట్టుకుని అసభ్యంగా తాకూతూ వేధింపులకు గురిచేసిన ఇద్దరు యువకులకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రసారం అయింది. సిసి టీవీలో నమోదయిన ఈ దృశ్యాలపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. నడుచుకుంటూ వస్తున్న సదరు యువతిని అడ్డుకున్న ఇద్దరు యువకులు ఆమెపై లైంగికంగా దాడి చేసిన దృశ్యాలు సిసి టీవీలో నమోదయ్యాయి. సదరు యువతిపై లైంగిక దాడితో పాటుగా ఆమెను కిందకు నెట్టేసిన దృశ్యాలు కూడా నమోదయ్యాయి.
bengaluru
బాధిత యువతి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయనప్పటికీ పోలీసులే ఫుటేజీ ఆధారంగా కేసును నమోదు చేసుకున్నారు. నిందితులపై లైంగిక వేధింపుల చట్టాల కింద కేసులు నమోదు చేశారు. యువతిని తీవ్రంగా వేధించిన వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరో వైపు యువతిని ఇద్దరు యువకులు వేధిస్తున్నా అక్కడ ఉన్నవారు చూసీ చూడనట్టు వ్యవహరించారు. కనీసం యువతిని కాపాడాలనే సృహ కూడా లేకుండా వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *