2017 అక్టోబర్ లో భూమి అంతమయిపోతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. ఇట్లాంటి ఊహాజనికి వార్తలను నమ్మవద్దని ఇవన్నీ ఇంటర్నెట్ లో కనిపించే బూటకపు వార్తలను నాసా పేర్కొంది. నిబిరు అనే ఓ గ్రహం భూమి వైపు దూసుకుని వస్తోందని అది అక్టోబరులో భూమిని తాకడం వల్ల భూమి నాశనం అయిపోతుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ‘ప్లానెట్ ఎక్స్- ది 2017 అరైవల్’ పుస్తక రచయిత, వూహాజనిత సిద్ధాంతకర్త డేవిడ్ మియాడే భూమి అంతం అయిపోతోందని చేస్తున్న ప్రచారానికి ఇంటర్నెట్ లో విస్తృత ప్రచారం లభిస్తోంది. సమాజీక మాధ్యామాల్లో దినిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే అసలు అటువంటి గ్రహమే లేదని అవన్ని బూటకపు వార్తలని శాస్త్రవేత్తలు అంటున్నారు. అధారాలు లేకుండా కేవలం ఊహాజనిత వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారంటున్నారు. ఇటువంటి చెత్త వార్తలను నమ్మవద్దని కూడా సూచిస్తున్నరా.ు