మనం పోయినా మరో ఏడుగురిని బ్రతికించవచ్చు

    అవయవదానాన్ని తప్పనిసరిచేస్తూ ప్రాన్స్ తీసుకుని వచ్చిన చట్టం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాశంమైంది. ఒక మనిషి చనిపోయిన తరువాత ఏడుగురికి ప్రాణదానం చేసే అవకాశం ఉంది. అవయవదానం కోసం ఎదురుచూస్తున్న రోగుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. అయితే అవయవదానానికి ముందుకు వస్తున్న వారి సంఖ్య మాత్రం ఆశించిన మేరకు పెరగడం లేదు. దీనితో అవసరం అయిన వారికి అవయవాల కొరత తీవ్రంగా వేదిస్తోంది. అవయవదానంతో బతికే అవకాశం ఉన్నా మరణిస్తున్న వారు ఎందరో….

 • ఒక మనిషి చనిపోయిన తరువాత ఏడుగురికి ప్రాణదానం చేయవచ్చు
 • మనిషి తన శరీరంలోంచి 200 అవయవాలు, టిష్యూలను దానం చేయవచ్చు.
 • కళ్ళు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం,పెద్ద, చిన్నపేగులు, ఎముకలు, మూలుగను దానం చేయవచ్చు.
 • మనిషి బతికి ఉండగా ఇతరులకు తమ అవయవాలను దానం చేయవచ్చు. ఇందులో ప్రధానంగా కిడ్నీలు, కాలేయదానం ఉన్నాయి.
 • చనిపోయాక అవయవాల మార్పిడి గంటల్లో జరిగిపోవాలి.
 • గుండె ఆగి చనిపోతే కళ్లు, గుండె కవాటాలు వంటి వాటిని 6 నుంచి 24 గంటల్లోపు సేకరించవచ్చు.
 • రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కేసుల్లో ఎక్కువగా బ్రెయిన్‌ డెత్‌గా ప్రకటిస్తారు. వీరిని వెంటిలేటర్‌ నుంచి బయటకు తీసుకొచ్చేలోపు అవయవాలు సేకరించవచ్చు.
 • బయటకు తీసుకొచ్చాక గుండె అయితే నాలుగైదు గంటలు, కాలేయం 10-12 గంటలు, మూత్రపిండాలు 24 గంటల్లోపు సేకరించాల్సి ఉంటుంది.
 • మతపరమైన విశ్వాసాల వల్ల చాలా మంది అవయవదానానికి ముందుకు రావడం లేదు
 • ప్రజల్లో పేరుకుపోయిన నమ్మకాలు కూడా అవయవదానానికి అడ్డంకిగా మారాయి
 • అవయవదానంలో అబివృద్ధి చెందిన దేశాల్లోనూ మూడనమ్మకాలు ఎక్కువే
 • అమెరికా,యూరోపియన్ యూనియన్ లలో అవయవదానం ఆశించిన మేర జరగడం లేదు
 • ప్రాన్స్ లో అవయవదానం తప్పనిసరి చేస్తూ చట్టం చేసి ఇష్టం లేనివారు తమ పేర్ల నమోదు చేయించుకోవచ్చని చెప్పగా రెండు రోజుల్లోనే దాదాపు మూడు లక్షల మంది తాము ఆవయవదానం చేయమని పేర్లు నమోదు చేయించుకున్నారు.
 • చనిపోక ముందు అవయవదానానికి ఓకే చెప్పినా దాన్ని బంధువులు పాటించడం లేదు
 • చాలా సందర్భాల్లో చనిపోయిన వారి బంధువులు అవయవదానానికి ఒప్పుకోవడం లేదు
 • భారత్ లోనూ ఇదే పరిస్థితి
 • అవయవదానం కోసం ఏటా వేలాది మంది ఎదురుచూస్తున్నారు.
 • నేత్ర దానంపై ఎంత ప్రచారం చేసినా స్పందన మాత్రం అంతంతం మాత్రమే.
 • ప్రభుత్వం, స్వచ్చంధ సంస్థలు చేస్తున్న ప్రచారానికి స్పందన తక్కువగా ఉంటోంది.
 • పరిస్థితిలో మార్పు ఉన్నా ఇంకా అవయవదానాల సంఖ్య బాగా పెరగాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *