తనిఖీ లేకుండా సిమ్ లిస్తే జైలుకే

సిమ్ కార్డులను జారీ చేసే వారు వాటిని యాక్టివేట్ చేసే వారు జాగ్రత్తగా ఉండక పోతే జైలుకు పోవాల్సిందే. తప్పుడు పత్రాలతో సిమ్ కార్టులను పొందుతున్న వ్యక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అనేక నేరాల్లో పట్టుబడిన వారు తప్పుడు పత్రాలతో సిమ్ కార్డులను పొందినట్టు రుజువు కావడంతో పాటుగా ఉగ్రవాదులు కూడా తప్పుడు పత్రాలతో సిమ్ కార్డులను పొందుతున్నారు. దీన్ని కట్టడి చేయడానికి పోలీసులు నడుంబిగించారు. తప్పుడు పత్రాలు సమర్పించి సిమ్ పొందిన వ్యక్తులతో పాటుగా పత్రాలను సరిగా పరిశీలించని దుకాణుదారులపై కూడా చర్యలకు పోలీసులు ఉపక్రమిస్తున్నారు. దీనితో పాటుగా సిమ్ యాక్టివేట్ చేసే సందర్భంలోనూ పత్రాలను సక్రమంగా పరిశీలించాలని లేని పక్షంలో వారిపైనా కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సిమ్ కార్డులను పత్రాలు పరిశీలించకుండా ఇచ్చిన వారిని, సిమ్ లను యాక్టివేట్ చేసిన వారిని కూడా జైలుకు పంపుతామని పోలీసులు చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ముందుగానే యాక్టివేట్ చేసిన సిమ్ లను అమ్ముతున్నట్టు కూడా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. దీనితో అటువంటి కేంద్రాలపై కూడా పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. సిమ్ లు సక్రమంగా తీసుకోకపోయినా లేదా తప్పుడు దృవపత్రాలతో సిమ్ లు ఇచ్చినా జైలుకు పోవాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *