దేశంలోని ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 4న కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుండగా ఉత్తర్ ప్రదేశ్ లోని కొన్ని నియోజక వర్గాల్లో మార్చి 8న ఎన్నికలు జరుగుతాయి. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు మార్చి 11న వెలువడతాయి. ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం ఏడు విడతలుగా పోలింగ్ నిర్వహించనున్నారు. మణిపూర్ లో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తుండగా ఇతర రాష్ట్రాల్లో ఒకే విడత పోలింగ్ జరగనుంది.
- ఉత్తర్ ప్రదేశ్ లో ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి
- ఇక్కడ మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి.
- తొలి విడత ఫిబ్రవరి 11న, రెండవ విడత ఫిబ్రవరి 15న, మూడో విడత ఫిబ్రవరి 19న, నాలుగో విడత ఫిబ్రవరి 23న, ఐదో విడత ఫిబ్రవరి 27న, ఆరో విడత మార్చి 4న, ఏడో విడత మార్చి 8న ఎన్నికలు జరగనున్నాయి.
- ప్రస్తుతం ఇక్కడ సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉండగా ప్రస్తుతం ఆపార్టీలో చీలికతో అఖిలేష్ వర్గం, ములాయం వర్గంతో పాటుగా బీజేపీ, బీఎస్పీ,కాంగ్రెస్ లు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి.
- పంజాబ్ లో ఒకే విడత ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్ లో ప్రస్తుతం శిరోమణి అకాలీదళ్-బీజేపీ కూడమి అధికారంలో ఉంది. కాంగ్రెస్, ఆప్ పార్టీలు ప్రధానంగా అధికారం కూడా పోటీ పడుతున్నాయి
- 40 సీట్లున్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 4న ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో అధికారం కోసం కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధమవుతోంది.
- 60 అసెంబ్లీ స్థానాలున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో రెండు విడతలుగా పోలీంగ్ జరగనుంది మొదటి విడత మార్చి 4వ తేదీన జరుగుతుండగా రెండవ విడత మార్చి 8న జరగనుంది. కాంగ్రెస్, బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ లు ఇక్కడ ప్రధానంగా పోటీ పడతున్నాయి.
- 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తారాఖండ్ లో ఫిబ్రవరి 15న పోలింగ్ జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీ తలపడుతున్నాయి.
- ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 16కోట్ల మంది ఓటర్లున్నారు.