అంతర్జాతీయ నేరగాడు, మోస్ట్ వాంటెడ్ దావుద్ ఇబ్రహీం ఆస్తులను దుబాయ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 15వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచానా. దావూద్ ఇబ్రహీం ఆస్తులను స్వాధీనం చేసుకున్న విషయాన్ని దుబాయ్ అధికారులు దృవీకరించారు. దుబాయ్ లో ఉన్న దావూద్ కు చెందిన స్థలాలను యూఏఈ అధికారులు సీజ్ చేశారు. గత ఏడాది దుబాయ్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీ దావూద్ పై ఉన్న కేసులకు సంబంధించి అక్కడి ప్రభుత్వ సహకరాన్ని కోరారు. దీనికి స్పందించిన యూఏఈ ప్రభుత్వం భారత్ అందించిన సమాచారం మేరకు విచారణ నిర్వహించారు. దావుద్ కు చెందిన ఆస్తులను గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఈ ఆస్తులను దావూద్ సోదరుడు పర్యవేక్షిస్తున్నట్టు గుర్తించారు. గోల్డెన్ బాక్స్ పేరుతో ఈ సంస్థను నడుపుతున్న దావూద్ సోదరుడు ఆస్తులను పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. దావూద్ కు దుబాయ్ తో పాటుగా మొరాకో, స్పెయిన్, యూఏఈ, సింగపూర్, థాయిలాండ్, సైప్రస్, టర్కీ, భారత్, పాకిస్థాన్, యూకెల్లోనూ ఆస్తులున్నాయి. ఈ అంతర్జాతీయ నేరగాడి పీచమణచడానికి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి భారత్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ఈ వ్యవహారంలో కీలక భూమిక నిర్వహించారు.