ప్రధాని నరేంద్ర మోడీ ఒక రోజు తిరుపతి పర్యటన ముగిసింది. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చిన ప్రధాన మంత్రికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. తిరులోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహిస్తున్న జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రస్తుతం భా రత్ ఆరో స్థానంలో ఉందని, ఇది 2030నాటికి మూడో స్థానంలో ఉంటుందనిఅన్నారు. సామాజిక అవసరాలను శాస్త్ర, సాంకేతిక రంగాలు తీర్చాలని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి జరగేందుకు సహాయపడాలని కోరారు. పేదల అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగా పరిశోధనలు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
అక్కడి నుండి ప్రధాని నేరుగా తిరుమల చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులతో కలిసి ప్రధాని స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత ఆలయ పండితులు మోడికి ఆశీర్వచనం పలికారు. స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందచేశారు.