జోర్ దార్ గా బీర్ల అమ్మకాలు

తెలంగాణ ప్రజలు బీర్లను తెగతాగేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 2016వ సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3కోట్లా 42 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. అదే సమయంలో మధ్యం 2 కోట్లా 70 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. మధ్యం కన్నా బీర్లు దాదాపుగా 70 లక్షల కేసులు అధికంగా అమ్ముడయ్యాయి. ఈ లెక్కన తెలంగాణ వ్యాప్తంగా బీర్లను ప్రజలు ఫుల్ గా లాంగిచేస్తున్నారు. గత ఏడాది కన్నా బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం జనాభా తలసరి చూసుకుంటే 8 గా బీర్ల అమ్మకాలు ఉండగా ఈ ఏడాది అది 11కు పెరిగింది. గత సంవత్సరం మొత్తం మధ్యం అమ్మకాలు 14వేల కోట్లను మించిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా అక్షరాల 14వేల కోట్ల రూపాయల మేరకు మధ్యం అమ్మకాలు జరిగాయి. జిల్లాల వారిగా చూస్తే రంగారెడ్డి ప్రధమ స్థానంలో ఉండగా హైదరాబాద్ జిల్లా రెండవ స్థానంలో ఉంది. నిజామాబాద్ లో ఆఖరి స్థానంలో ఉంది.
పెద్ద నోట్ల రద్దు కూడా మధ్యం అమ్మకాలపై ఎటువంటి ప్రభావం చూపలేదు. నోట్ల రద్దు తరువాత చాలా చోట్ల మధ్యం రేట్లను కొద్దిగా పెంచినప్పటికీ దాని ప్రభావం మందు కొనుగోళ్లపై పడలేదు. నోట్ల ఇబ్బందులను అధికమించి మరీ మధ్యాన్ని కొనుగోలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మధ్యం అమ్మకాలు పెరుగుతుండడంతో అబ్కారీ శాఖ భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. రాష్ట్ర ఖజానాకు ఎక్కువ ఆదాయం సమకూరుతోంది ఇక్కడి నుండే. తెలంగాణకు ఎక్కువ మొత్తంలో పరోక్షపన్నులు పడుతోంది మధ్యం ప్రియులే అన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *