నూతన సంవత్సర వేడుకల నగరంలో ఘనంగా జరిగాయి. యవతీ యువకులు ఫుల్ జోష్ తో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. హోటళ్లు, రిసార్ట్ లలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో యువకులు రోడ్ల పై తిరుగుతూ కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకున్నారు.ఆటపాటలు డీజే హోరులో కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్ని తాకాయి. కొత్త సంవత్సరం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ముందు జాగ్రత్త చర్యాగా పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. మధ్యం సేవించి వాహనాలను నడుపుతున్న వారిని పట్టుకుని బైక్ లను సీజ్ చేశారు.