ప్రపంచ వ్యాప్తంగా రకరకాల క్యాలెండర్లు వాడుకలో ఉన్నా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆచరించేది మాత్రం గ్రెగోరియన్ క్యాలెండర్ నే. జనవరి 1వ తేదీన కొత్త సంవత్సారాన్ని ప్రారంభించడం జూనియస్ సీజర్ కాలం నుండి ప్రారంభమైంది. క్రీస్తుశకం 46వ సంవత్సరంలో సీజర్ లిఖిత పూర్వకంగా క్యాలెండర్ తయారు చేయించాడు. పూర్వం నుంచి రెండు క్యాలెండర్లు ప్రాచుర్యంలో ఉండేవి. మొదటిది సూర్యమానం, రెండవది చంద్రమాన క్యాలెండర్. జూలియర్స్ సీజర్ తయారు చేయించిన కాలమాన పట్టిక సోలార్ క్యాలెండర్ ఈ క్యాలెండర్ ఆధారంగానే జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం ప్రారంభ దినంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. కొత్త ఏడాది ఉత్సవాలను డిసెంబర్ 25న జరుపుకోవడం మొదలుపెట్టారు. తరువాత పద్ధతి లేకుండా పోయిన క్యాలెండర్ చరిత్రను పోప్ 13వ గేగారీ తిరిగి రాయించారు. ఆయన ఆదేశాల మేరకు కొత్త క్యాలెండర్ రూపొందించారు. సీజర్ క్యాలెండర్‌కు ఆయన సవరణలు చేసి, 365రోజులు, 12 నెలలు, 52వారాలు అధనంగా లీపు ఇయిర్కు ఒకరోజు అధనంగా చేర్చి రూపొందించిన క్యాలెండర్‌ను గ్రేగోరియన్ క్యాలెండర్‌గా నామకరణం చేశారు.
ఇంగ్లిష్ క్యాలెండర్‌లోని సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాలను మన తెలుగు అంకెలతో పోలిస్తే , సెప్టెంబరు అనే పదం మన సప్త సంఖ్యను పోలి ఉంటుంది. మొదట తయారయిన ఇంగ్లిష్ క్యాలెండర్లో సెప్టెంబరు మాసం ఏడవది కావడం వల్ల ఆ పేరును నిశ్చయించినట్లు చరిత్ర చెబుతోంది. అలాగే అక్టోబరు – అష్ట, నవంబరు – నవ, డిసెంబరు – దశ… ఈ పదాలన్నీ కూడా మన పదాలకు దగ్గర దగ్గరగా ఉన్నాయి.
పోప్ గ్రెగరీ -గీఐఐఐ, 1572లో చక్రవర్తిగా ఎన్నికైనప్పుడు, నాటి మేధావి వర్గం క్యాలెండర్ సవరణల గురించి ప్రతిపాదన తీసుకురావడంతో, అప్పటివరకు ఉన్న జూలియన్ క్యాలెండర్‌ను మార్పు చేసి గ్రెగోరియన్ క్యాలెండర్‌ను వాడుకలోకి తెచ్చారు. గ్రెగోరియన్ క్యాలండర్‌నే వెస్టర్న్ క్యాలెండర్ అని, క్రిస్టియన్ క్యాలెండర్ అని కూడా అంటారు. పోప్ గ్రెగరీ -గీఐఐఐ పేరు మీద రూపొందిన ఈ క్యాలెండర్‌ని నేడు అంతర్జాతీయంగా ఉపయోగిస్తున్నారు.
అంతకు ముందు ఉన్న జూలియన్ క్యాలెండర్‌ని కొద్దిగా అంటే కేవలం 0.002 శాతం మాత్రం మార్పులు చేసి దీనిని రూపొందించారు. ఈ మార్పుని ముందుగా ఐరోపా ఖండంలోని క్యాథలిక్ దేశాలు అంగీకరించాయి. ప్రొటెస్టంట్లు, తూర్పున ఉన్న శుద్ధ సంప్రదాయ దేశాలు ఈ క్యాలెండర్‌ని అంగీకరించడానికి చాలాకాలమే పట్టింది. గ్రెగోరియన్ క్యాలెండర్ సూర్యమానం ఆధారంగా రూపొందింది. ఈ క్యాలెండర్‌ని అంగీకరించిన ఆఖరి దేశం గ్రీస్ (1923).
కొత్త సంవత్సరం
గ్రెగోరియన్ క్యాలెండర్ జూలియన్ క్యాలెండర్లో చేసిన ముఖ్యమైన మార్పు లీపు సంవత్సరం. ఆ ప్రకారం జనవరికి 31 రోజులు ఉంటే, ఫిబ్రవరికి 29 రోజులు, మార్చి నెలకు 31 రోజులు… ఇలా వస్తాయి. క్రీ.పూ. 222 వరకు మే 1 వ తేదీని, కొంతకాలానికి మార్చి 15 వ తారీకుని, క్రీ.పూ. 153 నుంచి జనవరి 1 వ తేదీని కొత్త సంవత్సరంగా ప్రకటించారు. ఇది మనం వాడుతున్న క్యాలెండర్ చరిత్ర