రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ ప్రజలకు నూతన సంవత్స కానుకను అందచేసింది. ఏటీఎంల నుండి నగదు విత్ డ్రా చేసుకునే పరిమితిని పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. జనవరి 1వ తేదీ నుండి ఇది అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు ఏటీఎంల నుండి 2500 మాత్రమే తీసుకునే అవకాశం ఉండగా ఇప్పుడు ఈ పరిమితిని 4500 కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే వారానికి 24 వేల రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకునే నిబంధన మాత్రం మారలేదు. ఇప్పుడు కూడా వారానికి 24వేలకు మించి విత్ డ్రా చేసుకునే అవకాశం లేదు. రిజర్వ్ బ్యాంకు 4500 విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించినా ఎటీఎంలలో ఎక్కడా నగదు లభ్యం కావడం లేదు. చాలా వరకు ఏటీఎం లలో డబ్బులు ఉండడం లేదు. అక్కడక్కడా ఏటీఎంలలో నగదు లభిస్తున్నా వాటిదగ్గర భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఏటీఎంలు ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొంది.