క్యాబ్ డ్రైవర్ల సమ్మె

క్యాబ్ డ్రైవర్లు సమ్మె బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ క్యాబ్ డ్రైవర్లు డిసెంబర్ 30వ తేదీ అర్థరాత్రి నుండి సమ్మెకు దిగుతున్నారు. తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల సంఘం సమ్మె చేస్తున్నట్టు ఈ సంఘం అధ్యక్షుడు శివ వెల్లడించారు.7 వేల మంది క్యాబ్ అస్సోసియేషన్ లో సభ్యులుగా వున్నారు. ఇతర క్యాబ్ అస్సోసియేషన్ సభ్యులు, డ్రైవర్ కం ఓనర్ స్కీమ్ లో సభ్యులయిన డ్రైవర్లు, లీజ్ వెహికల్ సభ్యులు కూడా సమ్మె లో పాల్గొంటారని సంఘం వెల్లడించింది. ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లతో పాటు ప్రతి క్యాబ్ డ్రైవర్ సమ్మె లో పాల్గొంటారని చెప్పారు.ఓల, ఉబర్ క్యాబ్ ల పుణ్యమా అని రోడ్డుపాలయ్యామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉబర్ టు వీలర్ ను తీసుకురావడం వలన తమకు తీవ్రనష్టం కలుగుతోందని డ్రైవర్లు చెప్తున్నారు. రవాణా శాఖ మంత్రికి, ఇతర అధికారుల ద్రుష్టి కి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని వాపోయారు,అంతే కాక ఉబర్ టు వీలర్ లను సీఎం క్యాంపు ఆఫీస్ లోనే లాంచ్ చేయడం వెనుక ఉన్న అర్థం ఏంటని ప్రశ్నించారు…బంగారం, స్థలాలు అమ్ముకొని మరి కార్ల ను కొని ఉబర్, ఓలా కంపెనీ లలో పెట్టమని, కానీ ప్రస్తుతం బూకింగ్స్ లేక కనీసం కార్ల ఈఎంలు కూడా కట్టలేక పోతున్నామని, రోజువారి ఖర్చులు కూడా రావడం లేదంటున్నారు…రోజు కు 18 గంటలు క్యాబ్ డ్రైవింగ్ చేయడం వలన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు,డ్రైవర్ల సమస్యలను యాజమాన్య దృష్టికి తీసికెళ్లిన సరిగా పట్టించుకోక పోక దాడులు కూడా చేసారని తెలిపారు…న్యూ జాయినింగ్ అనే విధానాన్ని రద్దు చేయాలి…షేర్ బుకింగ్ విధానం వలన తమకు నష్టం కలుగుతోందని, ఆ విధానాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేసారు…పీక్ అవర్స్ (అనగా ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు) విధానాన్ని తేసివేయాలి…ఆన్ డ్యూటీ లో వున్న డ్రైవర్లకు పూర్తి సెక్యూరిటీ కల్పించాలి. ఇది లేకపోవడం వలన డ్రైవర్ల పై దాడి చేసి కార్లు ఎత్తుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటివి జరిగినప్పుడు కంపెనీ బాధ్యత వహించి డ్రైవర్ కు నష్టపరిహారం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *