దేశంలోని సాఫ్టవేర్ ఉద్యోగుల్లో చాలా మంది కలలు కనే హెచ్-1 బి వీసాల మంజూరు మరింత కఠినతరం చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత హెచ్-1 బి వీసాల మంజూరును కఠినతరం చేయాలని అమెరికా భావిస్తోంది. విదేశీ వలస ఉద్యోగులకు అడ్డుకట్ట వేసేలా నిబంధనలు కఠినతరం చేస్తామన్న ఆయన ప్రకటనలు అమెరికా జాబ్ ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. విదేశీ వ్యక్తులను నియమించుకునే క్రమంలో సంబంధిత జాబ్ ప్రొఫైల్‌కు అవసరమైనlనైపుణ్యాలున్న వారు అమెరికాలో లభించడం లేదని ధ్రువీకరణ ఇస్తేనే హెచ్–1బి వీసా స్పాన్సర్షిప్ లెటర్ దరఖాస్తుకు అనుమతి లభిస్తుంది. అయితే ఈ విధానంలో తక్కువ వేతనాలకే విదేశీయులను నియమించుకుంటున్నారనే విమర్శ ఉంది. అంతేకాకుండా ఆయా జాబ్ ప్రొఫైల్స్‌కు అవసరమైన స్కిల్స్ కలిగిన యువత అమెరికాలో ఉన్నారని అక్కడ కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. ఏటా 65 వేల పరిమితిగా ఉన్న హెచ్–1బి వీసాల సంఖ్యను 15 నుంచి 20 శాతం తగ్గించే అవకాశముంది. విదేశీ ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన వీసా ఫీజు, ఇతర ఆర్థిక వ్యయాలు (ఉద్యోగులకు ఇచ్చే ఇన్సూరెన్స్, సోషల్ సెక్యూరిటీ ఫీజు తదితరాలు) పెంచడం.కనీస వేతన పరిమితిని పెంచడం. ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు ఇచ్చే కనీస వేతన పరిమితి కంపెనీలు, ఉద్యోగ విధుల స్థాయిని బట్టి 65 వేల డాలర్ల నుంచి 1.2 లక్షల డాలర్ల మధ్యలో ఉంది.