కోహ్లీ,అనుష్క ల ఎంగెజ్ మెంట్ లేనట్లే

0
57

బాలీవుడ్ నటి అనుష్క శర్మతో జనవరి1వ తేదీన ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలను భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఖండించాడు. తమ ఎంగేజ్ మెంట్ ఏదీ జరగడంలేదని అటువంటి ఆలోచన కూడా తమకు లేదని విరాట్ స్పష్టం చేశాడు. ఒక వేళ తాను ఎంగెజ్ మెంట్ చేసుకోదలస్తే అందరికీ చెప్పే చేసుకుంటాను తప్ప దొంగతనంగా చేసుకోవాల్సిన అవసరం తనకులేదన్నాడు. తన ఎంగేజ్ మెంట్ కు సంబంధించి మీడియా లో వస్తునన వార్తలన్నీ అబద్దపు ప్రచారాలేనని చెప్పాడు. అనుష్క శర్మ కూడా ఈ వార్తలను ఖండించింది.తాము మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు నిజంకాదని చెప్పింది. ఒక వేళ నిజంగా ఎంగెజ్ మెంట్ జరుగుతుంటే తప్పకుండా అందరికీ చెప్పి చేసుకుంటానని అనుష్క అంటోంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఉన్న ఈ జంట జనవరి 1న ఎంగెజ్ మెంట్ చేసుకోబోతోందని ప్రచారం జరిగింది. అయితే తాము కొత్త సంవత్సర వేడుకల కోసమే ఇక్కడికి వచ్చినట్టు ఈ జంట పేర్కొంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here