రామచంద్రాపురం ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. పక్కా వ్యూహంతో ఆరితేరిన ముఠాయే ఈ దోపిడికీ పాల్పడినట్టు నిర్థారణకు వచ్చిన పోలీసులు ఈకేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముత్తూట్ లో దోపిడీకి పాల్పడిన తరువాత ఈ ముఠా తప్పుడు నెంబర్ ప్లేట్ తో ఉన్న వాహనంలో రాష్ట్రం సరిహద్దులు దాటి కర్ణాటకలోకి ప్రవేశించారు. ఈ ముఠా ప్రయాణించిన వాహనానికి సంబంధించిన ఆధారాలు పోలీసులకు చిక్కాయి. కర్ణాటకలోని కలబుర్గి వరకు వీరు ప్రయాణించిన కారు తాలుకూ వివరాలు పోలీసులకు చిక్కాయి. పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్ గా తీసుకుంటున్న దాన్ని బట్టి ఈ దోపిడికి పాల్పడింది ఎవరూ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది సాధారణ దోపిడీ ముఠా పనికాదని బావిస్తున్న పోలీసులు అత్యంత పకడ్బందీగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.
- ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును అత్యంత సీరియస్ గా తీసుకున్న పోలీసులు
- సైబరాబాద్ సంయూక్త కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్వయంగా కలబుర్గిలో మకాం
- దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు
- రంగంలోకి సుశిక్షిత పోలీసులు
- దొంగలు ఎదురుపడితే ఎలా వ్యవహరించాలనే దానిపై ప్రత్యేక శిక్షణ తీసుకున్న బృందం
- దొపిడీకి పాల్పడింది ఉగ్రవాదులా అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు
- ఉగ్రకోణం ఉండడంతో రంగంలోకి దిగిన సుశిక్షత పోలీసు బృందం
- సూర్యాపేట తరహా ఘటనలు జరక్కుండా ముందు జాగ్రత్త చర్యలు
- సూర్యాపేట ఉగ్రవాదులను దొపిడీ దారులుగా భావించి ప్రాణాలు కోల్పోయిన పోలీసులు
- పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళుతున్న పోలీసులు
- దోపిడీకి ముందు రోడ్డు ప్రమాదం డ్రామా అడినట్టుగా భావిస్తున్న పోలీసులు
- ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ ముఠాను త్వరలోనే పట్టుకుంటామని పోలీసుల విశ్వాసం
- రంగంలోకి గ్రేహౌండ్స్ దళాలు