సినిమా అవకాశాలంటూ బాలికపై అత్యాచారం

సినిమా మీది మోజుతో నగరానికి వచ్చిన ఓ 15 సంవత్సరాల బాలికను 17 రోజుల పాటు అత్యాచారం చేశారు ఐదుగురు దుర్మార్గులు. సినిమాల్లో స్థిరపడాలనే ఆశతో నగరానికి వచ్చిన యువతికి మాయమాటలు చెప్పిన సినిమాల్లో  అవకాశం కల్పిస్తామంటూ ఐదుగురు యువకులుకు యువతిని నగరంలోని పలు ప్రాంతాలతో పాటుగా శివార్లలో తిప్పుతూ 17 రోజులపాటు అత్యాచారం చేశారు. బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డ ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం సినిమాల్లో చేరాలనే కోరికతో 15 సంవత్సరాల యువతి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉంటున్న మేనమాల ఇంటికి వచ్చింది. బాలిక సినిమాల్లో నటించాలని దానికోసం అవకాశం కల్పించాలని పలువురిని కోరింది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఇందిరానగర్ కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్లు  షేక్ అక్బర్, తూము వెంకటరెడ్డి, ప్రొడక్షన్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నండూరి పాపారావు, మోయినాబాద్ కు చెందిన గుడుపల్లి నవీన్ కుమార్ లు సదరు బాలికకు సినిమాల్లో అవకాశం కల్పిస్తామని నమ్మించి రంగారెడ్డి జిల్లా నందిగామకు తీసుకని వెళ్లారు. అక్కడ కుమార్ అనే మరో వ్యక్తి వీరికి జత కలిశారు. వీరు ఐదుగురు కలిసి బాలికపై అత్యాచారానికి తెగబడ్డారు. అక్కడి నుండి ఆమెను 17 రోజుల పాటు నందిగామ, చింతల్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో తిప్పుతూ 17 రోజుల పాటు అత్యాచారం చేశారు. వీరి బారినుండి తప్పించుకున్న బాలిక పోలీసులను ఆశ్రయించగా పోలీసులు నిందితుల్లో నలుగురిని అరెస్టు చేశారు. కుమార్ పరారీలో ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *