టెన్నీస్ కు అనా గుడ్ బై

ప్రపంచ మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి, సెర్బియా అందాల భామ అనా ఇవనోవిచ్ టెన్నీస్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రొఫెషనల్ క్రిడాకారిణిగా అనేక ఎత్తుపల్లాలు చూసిన ఈ సెర్బియా క్రీడాకారిణి తాను ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్నానని అందుకే రిటైర్ అవుతున్నట్టు ప్రకటించింది. 29 సంవత్సరాలకే టెన్నీస్ కు గుడ్ బై చెప్పడం బాధగా ఉన్నప్పటికీ సరైన ఆటతీరును ప్రదర్శించలేక అనామకంగా ఉండడం కన్నా ఆట నుండి తప్పుకోవడమే మంచిదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. తాను తీసుకున్న నిర్ణయం పట్ల తాను ఆనందంగానే ఉన్నానని అయితే తాను ఎంతగానే ప్రేమించే ఆట నుండి రిటైర్ కావడం తనను బాధిస్తోందని చెప్పింది.
అయిదు సంవత్సరాలకే క్రికెట్ రాకెట్ ను పట్టుకున్న అనా టెన్నిస్ లో అగ్రశిఖరానికి చేరుకుంది. 2008లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను సాధించడం ద్వారా ఈ ఫీట్ ను సాధించిన తొలి సెర్బియా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. తన కెరీర్ లో చాలా ఎత్తు పల్లాలు చూశానని తాను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిల్చిన వారికి, తాను ఈ స్థాయికి చేరుకోవడానికి సహకరించిన వారందరికీ ఈ సెర్బియా బ్యూటీ కృతజ్ఞతలు తెలిపింది.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *