జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన జడ్జీ

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, పురచ్చితలైవి జయలలిత మృతి పై తమకు కూడా అనుమానాలు ఉన్నాయంటూ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి వైద్యనాథన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ అనుమానాలు తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రనేనని హైకోర్టు స్పష్టం చేశారు. జయలలిత మృతిపై ఉన్న అనుమానాలను తీర్చాలంటూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై విచారణ ప్రారంభిస్తూ న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. జయలలితకు అపోలో ఆస్పత్రిలో 75 రోజులపాటు చికిత్స జరిగిందని అయినప్పటికీ ఆమెకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయకురాకపోవడం, ఆమె ఏ సమయంలో చనిపోయారనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పకపోవడం, ఆమె అందచేసిన చికిత్స ఏమిటన్న దానిపై వివరాలు బయటకు పొక్కకుండా అత్యంత గోప్యంగా ఉంచడం వంటి అంశాలకు సంబంధించి ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్ ను విచారించిన కోర్టు జయ మరణంపై సందేహాలు వ్యక్తం చేసింది. జయ ఆరోగ్యం పై ఎటువంటి సమాచార లోపం లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఎప్పటికప్పుడు బులెటన్ ల రూపంలో జయ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఆసుపత్రి విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సమగ్ర వివరాలను సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *