దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం పై విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేసిన అన్నా డీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప లాయర్లపై అన్నాడీఎంకే కార్యాలయం ఎదుటద దాడి జరిగింది. అన్నా డీఎంకే పార్టీ నుండి బహిష్కరింపబడి శశికళ పుష్ప జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటుగా జయ సన్నిహితురాలు శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆమెకు ఎటువంటి చికిత్స చేశారు. అమె చికిత్సకు సంబంధించి ఎవరి అనుమతులు తీసుకున్నారు అన్నదానిపై విచారణ జరపాలని పుష్ప డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పుష్ప న్యాయవాదులు నోటీసులు ఇవ్వడానికి అన్నాడీఎంకే కార్యాలయానికి వెళ్లగా అక్కడ ఉన్న కార్యకర్తలు లాయర్లపై దాడి చేశారు. పుష్ప ఎవరని అమెకు నోటీసులు ఇచ్చే అధికారం ఎవరు ఇచ్చారు అంటూ లాయర్లను తరిమితరిమి కొట్టారు. లాయర్లను తీవ్రంగా కొట్టడంతో వారు రోడ్లపై పరుగులు తీశారు. లాయర్ల వెంటపడి మరీ అన్నాడీఎంకే కార్యకర్తలు పుష్ప లాయర్లపై విరుచుకుని పడ్డారు. అన్నాడీఎంకే లాయర్ల దాడి నుండి లాయర్లను అతికష్టం మీద పోలీసులు రక్షించారు.
లాయర్లపై దాడిని పుష్పతో పాటుగా ఇతర విపక్షాలు ఖండించాయి. అన్నా డీఎంకే ను శశికళ తన చెప్పుచేతుల్లో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అడ్డు చెప్పిన వారిపై దౌర్జన్యాలకు కూడా దిగుతున్నారని పుష్ప మండిపడ్డారు. తమ లాయర్లపై దాడి చేసింది నిజమైన అన్నా డీఎంకే కార్యకర్తలు కాదని వారంతా శశికళ, వారి బందువర్గం పెంచి పోషిస్తున్న గుండాలని పుష్ప ఆరోపించారు.