రద్దయిన పెద్ద నోట్లను 2017 మార్చి 31వ తేదీ తరువాత కూడా తమ దగ్గర ఉంచుకుంటే జైలుకు వెళ్లాల్సిందే. ఈ మేరకు ప్రభుత్వం చట్టంలో మార్పులు తీసుకుని వస్తోంది. దీనికోసం గాను కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సును జారీచేసింది. దీని ప్రకారం మార్చి 31వ తేదీ తరువాత ఎవరైనా రద్దయిన రు.500, రు.1000 రూపాయల నోట్లను ఉంచుకుంటే వారిని జైలుకు పంపుతారు. పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం వాటిని బ్యాంకుల్లో జమ చేయడానికి డిసెంబర్ 30వ తేదీవరకు గడువు విధించింది. డిసెంబర్ 31వ తేదీ నుండి మార్చి 30వ తేదీవరకు రద్దయిన నోట్లను కేవైసీ ఫారాలు సమర్పించి రిజర్వు బ్యాంక్ లో జమచేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే అప్పటికీ బ్యాంకుల్లో డబ్బును జమ చేయకుండా తమ దగ్గర ఉంచుకుంటే జైలుకు వెళ్లాల్సిందే. మార్చి 31వ తేదీ తరువాత రద్దయిన నోట్లు కలిగిఉన్న వ్యక్తులకు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు తీసుకుని వస్తే ప్రభుత్వం ఆర్డినెన్సును జారీచేసింది.