సీబీఐ అధికారులమంటూ భారీ దోపిడీ

సంగారెడ్డి, బీరంగూడలో భారీ దోపిడీ జరిగింది. స్థానిక ముత్తుట్ ఫైనాన్స్ కార్యాలయంలో దుండగులు దాదాపుగా 10కోట్ల రూపాయల విలువైన 50 కేజీల బంగారాన్ని దోచుకుని వెళ్లారు. ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలోకి సీబీఐ అధికారులమంటూ దర్జాగా ప్రవేశించిన దుండగులు సిబ్బందిని తొలుత బంగారం ఎక్కడ ఉందంటూ వాకబు చేశారు. వీటికి సంబంధించిన పత్రాలు చూపించాలంటూ ఒత్తిడి చేస్తూ ఒక్కసారిగా వారికి మారణాయుధాలు చూపి బెదిరించి బంగారాన్ని మొత్తం తీసుకుని ఉడాయించారు. మొత్తం నలుగురు దుండగులు వచ్చారని వారంతా ఎర్ర రంగు స్కార్పియో వాహనంలో వచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
దోపిడీ జరిగిన తీరు చూస్తుంటే దుండగులు అత్యంత పకడ్బందీగా ఈ దోపిడీ జరిపినట్టు స్పష్టమవుతోంది. వాహనంలో వచ్చిన నలుగురు దుండగులు తమని తాను సీబీఐ అధికారుగా పరిచయం చేసుకోవడం లోపలికి వచ్చిన తరువాత మారణాయుధాలతో బెదిరింపులకు దిగడం చూస్తుంటే వీరు పక్కా ప్రణాళికతోనే దోపిడీ జరిపినట్టు తెలుతోంది. పెద్ద నోట్ల రద్దు తరవాత దేశవ్యాప్తంగా సీబీఐ నిర్వహిస్తున్న దాడులను ఆసరాగా చేసుకని పక్కా స్కెచ్ తోనే ఈ దోపిణికి పాల్పడ్డారు. దోపిడీ పై ముత్తూట్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *