హోటళ్ల మధ్య యద్ధం-కుక్కమాంసం అంటూ ప్రచారం

మేక మాంసం పేరిట కుక్క మాంసాన్ని విక్రయిస్తున్నారంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. చెన్నై, బెంగళూరులోని పలు చోట్ల కుక్క, పిల్ల మాంసాన్ని మేక మాంసంలో కలిపి విక్రయిస్తున్న సంగతి వాస్తవమేనని కొన్ని స్వచ్చంధ సంస్థలు నిర్థారించాయి. అయితే దీన్ని అవకాశంగా తీసుకుని నగరంలోని ఒక ప్రముఖ హోటల్ పై పెద్ద ఎత్తున వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
నగరంలోని ప్రముఖ హోటళ్లలో షాగోస్ ఒకటి. ఇక్కడ మేక మాంసం పేరిట కుక్క మాంసాన్ని విక్రయిస్తున్నారంటూ జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వచ్చాయి. దీనితో జీహెచ్ఎంసీ అధికారులు హోటల్ పై దాడులు చేసి తమతో శాంపిల్స్ ను తీసుకుని వెళ్లారు. దీన్ని అవకాశంగా చేసుకున్న ప్రత్యర్థి హోటళ్లు రంగంలోకి దిగి షాగోస్ లో కుక్కమాంసం పట్టుబడిందని ప్రచారం చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు శాంపిల్స్ కోసం తీకున్న ఫొటోలను పెడుతూ భారీ ఎత్తున ప్రచారానికి దిగడంతో నిత్యం ఇక్కడికి వచ్చే వేలాది మంది భయాందోళనకు గురయ్యారు.
శాంపిల్స్ ను మాత్రమే తీసుకున్న అధికారులు వాటిని పరీక్షించిన తరువాతే ఫలితాలను వెల్లడిస్తారు. ఇప్పటివరకు అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం కుక్కు మాంసం అంటూ విపరీతమైన ప్రచారం జరిగిపోయింది. దీనిపై స్పందించిన షాగోస్ యాజమాన్యం తమను అప్రదిష్ట పాలు చేసేందుకు కొంతమంది పనిగట్టుకుని ఇటువంటి అబద్దుపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హోటళ్ల మధ్య ఉన్న ఆధిపత్యపోరు వల్ల జరుగుతున్న ప్రచారాల వల్ల హోటళ్లకి వెళ్లడానికే ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *