హైదరాబాద్ కు వచ్చిన మోడీ

 ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చారు. సర్దార్ వల్లభాయ్‌ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరుగుతున్న డీజీపీ/ఐజీపీల సమావేశంలో ఆయన పాల్గొంటారు.   ప్రధానికి    కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. అంతర్గత భద్రతకు సంబంధించి అత్యంత కీలకమైన ఈ సమావేశంలో పాల్గొంటున్న ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా ఇతర రాజకీయ ప్రముఖులను కలుస్తారా లేదా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *