హైదరాబాద్ కు మరో రింగ్ రోడ్డు

హైదరాబాద్ చిట్టూతా త్వరలోనే మరో రింగ్ రోడ్డును ఏర్పాటు  చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ కు ప్రస్తుతం ఉన్న రింగ్ రోడ్డు ఏ మాత్రం సరిపోదని సీఎం చెప్పారు. భవిష్యత్ అవసరాలను తీర్చడం కోసం కొత్త రింగ్ రోడ్డు నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని త్వరలో 338 కిలోమీటర్ల రీజనినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు కాబోతోందని సీఎం పేర్కొన్నారు.         

    సమైఖ్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి పూర్తి అన్యాయం జరిగిందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి జాతీయ రహదారుల విషయంలో రాష్ట్రం అట్టడుగు స్థాయిలో ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం హయాంలో తెలంగాణకు పెద్ద ఎత్తున జాతీయ రహదారులను తీసుకుని వచ్చినట్టు చెప్పారు. గత 70 సంవత్సరాలలో ఎన్ని రహదారులు మంజూరు అయ్యాయే తెంగాణ రాష్ట్రం ఏర్పడితిన తరువాత ఈ రెండు సంవత్సరాల కాలంలో అన్ని జాతీయ రహదారులు ఏర్పాటయ్యాయని కేసీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుని పోతోందని ప్రజలకు కరెంటు కష్టాలు తొలగి పోయాయని ప్రాజెక్టులు నీళ్లతో కళకళలాడుతున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని అంతం చేయడానికే తెలంగాణ ఉధ్యమం పుట్టిందన్నారు. 1999లో తెలంగాణ ఉధ్యమానికి బీజం పడగా 2001లో ఉధ్యమం ఊపందుకుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *