హెచ్ 1-బీ పై మరోసారి ట్రంప్ కీలక వ్యాక్యలు

అమెరికా తదుపరి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్ 1బి వీసాలపై విరుచుకుని పడ్డాడు. ఈ వీసాలు అమెరికన్ల ఉపాధి అవకాశాలను దెబ్బకొడుతున్నాయని మండిపడ్డారు. ట్రంప్ తన ప్రచార సమయంలో కూడా ఇటువంటి వీసాలపై విరుచుకునిపడిన సంగతి తెలిసిందే కాగా తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

అమెరికన్ల స్థానంలో విదేశీ ఉద్యోగులను సహించేది లేదంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. హెచ్-1 బి విసాల విషయంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ట్రంప్ మండిపడ్డారు. ఈ వీసాలతో మన పౌరులు ఇబ్బందులు పడుతున్నారు నేను ఆఖరి శ్వాస వరకు  అమెరికన్ల కోసమే పోరాటం చేస్తానని ట్రంప్ చెప్పారు. దీనితో హెచ్ -1 బి విసాలు ఆశీస్తున్న భారతీయుల్లో బెంగ మొదలైందనే చెప్పాలి. ఈ వీసాలను పొందుతున్న వారిలో ఎక్కువ మంది భారతీయులో ఉన్నారు.