హాయిగా నిద్రపోకపోవడం జబ్బే…

మనిషి ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. మంచి నిద్రలేకపోతే అనేక రకాల శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. నిద్రలేమి వ్యాధి ఇటీవల కాలంలో తీవ్ర సమస్యగా మారుతోంది. ఇటీవల కాలంలో నిద్రలేమితో బాధపడేవారి సంఖ్యం క్రమంగా పెరుగుతోంది. ప్రతీ మనిషికి కనీసం ఏడు గంటల నిద్ర అవసరం ఈ నిద్ర లేకపోతే ఆ ప్రభావం శరీరంపై పడి అనేక రకాల సమస్యలకు మూలం అవుతుంది.

నిద్ర రావడం లేదని చెప్పే వారిలో కనిపించే ప్రధాన సమస్య నిద్రలేమి (ఇన్‌సోమ్నియా). దాదాపు 15 నుంచి 30 శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. ‘వారానికి కనీసం మూడు రోజులు, కనీసం ఒక నెలపాటు నిద్రపట్టడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, మధ్యలో మెలకువ రావడం, రోజూ నిద్రలేవడానికంటే ముందుగా మెలకువరావడం’ జరిగితే వాళ్లు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు. పడుకున్న తర్వాత 20 నిమిషాల్లో నిద్రపోవడం సాధారణం. కానీ 30 నిమిషాలు గడిచినా నిద్ర రాకుంటే సమస్య ఉన్నట్లు గమనించాలి.

నిద్రలేమికి ప్రధాన కారణాలు

 • మాసిక ఒత్తిడి
 • సక్రమైన ఆహారపు అలవాట్లు లేకపోవడం
 • అధికంగా టీవీలు చూడడం, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లను ఎక్కువ సేపు వాడడం.
 • సిగరెట్లు తాగడం, ముధ్యం సేవించడం.
 •  నిద్రలేమితో ఎక్కువసేపు బాధపడేవారు వైద్యులను సంప్రదిస్తే మంచిది.
 • నిద్రలేమి వల్ల మధుమేహం , బీపి వచ్చే అవకాశాలున్నాయి.
 • నిద్రలేమితో బాధపడేవారు వయసుకన్నా పెద్దగా కనిపిస్తారు.
 • నిద్రలేమి వల్ల మానసిక అలజడి ఎక్కువగా ఉంటుంది.
  నిద్రలేమి నుండి బయటపడడానికి సూచనలు:
 • మానసిక ఆందోళనల నుండి దూరం కావాలి
 • రాత్రి పూట పడుకోవడానికి కనీసం మూడు గంటల ముందు నుండి కాఫీ,పెఫిన్ ఉన్న పదార్థాలు తీసుకోకూడదు.
 • మధ్యం సేవించడం, ధుమపానానికి దూరంగా ఉండాలి
 • మితమైన ఆహారం తీసుకోవాలి.
 • పడుకునే ముందు వ్యాయామం చేయవద్దు
 • పడుకునే గదిలో కంప్యూటర్లు, ఫోన్లను దూరంగా పెట్టండి
 • పడుకునే ముందు వేడిపాలు తాగడం మంచిది.
 • పుడుకునే ముందు వేడినీళ్ల స్నానం వల్ల ప్రయోజనం ఉంటుంది.