సాక్షీ స్పోర్ట్స్ రిపోర్టర్ జెస్సీ మృతి

జెస్సీగా అందరూ పిల్చుకునే సాక్షి టీవీ  స్పోర్ట్స్  రిపోర్టర్ జె.శ్రీనివాసులు గుండెపోటుతో మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జెస్సీ దాదాపు 30 సంవత్సరాలుగా స్పోర్ట్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్ కవరేజ్‌లో ఎన్నో రాష్ట్ర, జాతీయ అవార్డులను ఆయన అందుకున్నారు. శనివారం రాత్రి రెండు గంటల సమయంలో ఆయనకు తీవ్ర గుండెనొప్పి రావడంతో రామంతపూర్ లోని ప్రైవేట ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. జస్సీ హబ్సిగూడ లోని రోడ్ నెంబర్ -8లో నివాసం ఉంటున్నారు. స్పోర్ట్స్ న్యూస్ పై విశేష పరిజ్ఞానం ఉన్న జెస్సీ మరణం పట్ల పలువురు జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.