సరిహద్దుల్లో చైనా భారీ సైనిక విన్యాసాలు

భారత సరిహద్దుల్లో చైనా భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. వాస్తవాధీన రేఖకు సమీపంలోని ఈ ప్రాంతంలో చైనా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో 10వేల మందికి పై చిలుకు సైనికులు పాల్గొంటున్నారు. చైనా  ఇంత భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించడం ఇదే మొదటిసారి. జింజియాంగ్ ఉయ్ ఘర్ స్వతంత్ర ప్రాంతాల్లో ఈ సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం సముద్రమట్టానికి దాదాపు నాలుగు వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆదేశాల మేరకు ఈ సైనిక నిన్యాసాలు జరుగుతున్నట్టు సమాచారం. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ తో పాటుగా భారత్ లోని పశ్చిమ ప్రాంతాలను నిరంతరం పరిశీలించేందుకు గాను చైనా ఈ ప్రాంతంలో సైనిక స్థావరాలను సైతం నిర్మించుకుంటోంది. భారత్ -పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉధ్రిక్తతలు నెలకొన్న సమయంలో చైనా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. అయితే చైనా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలకు సంబంధించిన పూర్తి సమాచారం భారత్ వద్ద ఉంది. చైనా వ్యూహాలకు ధీటుగా మన సైన్యం కూడా ఎప్పడికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *