సభ నుండి కాంగ్రెస్,టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

0
59

నోట్ల రద్దుతో తొలిరోజు తెలంగాణ అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగ్గా రెండవ రోజు మాత్రం శాశనసభ సమావేశాలు రాసాభాసగా మారాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్ తో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ లు ఇచ్చిన వాయిదా తీర్మానం పై చర్చకు పట్టుపట్టిన విపక్షాలు ఆందోళన చేశాయి. చర్చను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, తెలుగుదేశం సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకునిపోయి నినాదాలు చేశారు. దీనితో తొమ్మిది మంది కాంగ్రెస్ శాసన సభ్యులను, ఇద్దరు తెలుగుదేశం శాసన సభ్యులను సభ నుండి స్పీకర్ సస్పెండ్ చేశారు. అధికార ప్రతిపక్షాల వాదోపవాదాలతో సభ వేడెక్కింది. కాంగ్రెస్ సభ్యులు  డి.కె.అరుణ, మల్లు భట్టివిక్రమార్క, సంపత్‌కుమార్‌, గీతారెడ్డి, చిన్నారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, పద్మావతిరెడ్డి, జీవన్‌రెడ్డిలను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రెవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను కూడా స్పీకర్ సస్పెండ్ చేశారు.
సభ్యుల సస్పెండ్ పై విపక్షాలు మండిపడ్డాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం మందబలంతో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. టీఆర్ఎస్ నియంతృత్వ పోకడలు దారుణమని విపక్షాలు అంటుండగా విలవైన సభా సమయాన్ని కాపాడుకోవడం కోసమే తాము సభను అడ్డుకుంటున్న వారిని సస్పెండ్ చేయక తప్పలేదని అధికార పక్షం అంటోంది. నియంతృత్వం అంటున్న కాంగ్రెస్ గతాన్నిగుర్తుపెట్టుకోవాలని మంత్ర హరీష్ రావు అన్నారు. కేవలం జై తెలంగాణ అన్నందుకే తమను సస్పెండ్ చేశారని ఆరోజులను మర్చిపోయారా అని ప్రశ్నించారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here