శ్రీవారి దర్శనానికి ఐడి కార్డు తప్పనిసరి

తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులు ఇక నుండి తప్పకుండా గుర్తింపు కార్డును తీసుకుని వెళ్లాలి. ఇక నుండి నడకదారి భక్తులు కూడా తప్పనిసరిగా గుర్తింపుకార్డులను తీసుకుని రావాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే అర్జిక సేవలు, గదుల కేటాయింపు, ఆన్ లైన్ సేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలకు గుర్తింపు కార్డులను తప్పనిసరి చేసిన టీటీడీ తాజాగా నడక భక్తులు కూడా గుర్తింపు కార్డులను తీసుకుని రావాలని సూచించింది. గుర్తింపు కార్డులు లేకుంటే నడక దారి భక్తులకు లభించే ప్రత్యేక దర్శన సౌకర్యంతో పాటుగా లడ్డుల టోకెన్లు కూడా ఇవ్వరు. తిరుమలకు చేరుకునే భక్తులకు గాలిగోపురంతో పాటుగా 1200వ మెట్టు వద్ద ప్రత్యేక టోకెన్లు ఇస్తారని దీనికోసం గాను గుర్తింపు కార్డు తప్పని సరని టీటీడీ పేర్కొంది.