శ్రీవారి ఏనుక్కి కోపం వచ్చింది

ఎందుకో ఏమో గానీ ఆ గజరాజుకు కోపం వచ్చింది. తాను నెత్తిన పెట్టుకుని ఊరేగే మావటీని కిందపడేసి కాలు విరగ్గొట్టింది. కొద్దిసేపు కోపంతో చిందులు తొక్కిన ఆ ఏనుగు శాంతించింది.  ఏనుగు కోపానికి బలైన మావటి మాత్రం ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వేలాది మంది భక్తులతో కిటకిట లాడే తిరుమలలో ఈ ఘటన జరిగింది. అయితే ఎనుగు కోపం వల్ల ఎవరికీ ఏ హానీ జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రతీరోజూ శ్రీవారి సేవల్లో పాల్గొనే రెండు ఎనుగులు లక్ష్మీ, అవనిజలను మావటీలు దేవాలయం వద్దకు తీసుకుని వస్తున్నారు. మాడవీధుల్లోకి వచ్చిన తరువాత అవనిజకు ఎందుకో కోపం వచ్చింది. మావటీపై దాడి చేసింది. కొండంతో కొట్టి కిందపడేసింది. అతను కాలు తొక్కడంతో మావటీ గంగయ్య కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. గట్టిగా ఘీంకరిస్తూ మాడవీధుల్లో పరుగులు పెట్టే ప్రయత్నం చేయడంతో అతి కష్టం మీద టిటిడి సిబ్బంది ఏనుగును అదుపులో పెట్టగలిగారు. అయితే మావటి గంగయ్యకు మాత్రం తీవ్రంగా గాయాలయ్యాయి. తొలుత అశ్వినీ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అందించిన తరువాత గంగయ్యను తిరుపతి బర్డ్ ఆసుపత్రికి తరలించారు.

కొద్ది సేపు కోపంతో ఘీంకరించిన అవనిజ అంతలోనే శాంతించింది. శ్రీవాహి సేవలో యధావిదిగా పాల్గొంది.