శరవేగంగా యాదాద్రి పనులు-కర్నూలులో సిద్ధమవుతున్న శిల్పాలు

 
 
యాదగిరిగుట్ట దేవాలయ అబివృద్ధి పనులు శరవేగంతో పూర్తవుతున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా యాదగిరి గుట్ట పనులను పర్యవేక్షిస్తుండడంతో పనులను అనుకున్న సమయానికల్లా పూర్తి చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. రానున్న దసరా నాటికి యాదగిరిగుట్ట దేవాలయ అబివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయంతో అపటికల్లా పనులను పూర్తిచేసేందుకు అధికారాలు నిర్విరామంగా పనులను పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే దేవాలయానికి అవసరమైన శిల్పాల రూపకల్పన పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. శ్రీశ్రీశ్రీ శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో ఆర్కిటెక్చర్ ఆనందసాయి ఆధ్వర్యంలో పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. వందల సంఖ్యలో శిల్పులు ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో శిల్పల నిర్మాణం జరుగుతున్నాయి.  అత్యున్నత పౌరాణిక చారిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న యాదగిరిగుట్టకు రావాల్సినంత ప్రాధాన్యం లభించలేదని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక యజ్ఞం లాగా దేవాలయ అబివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు.
*భారతదేశంలోనే సుప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో యాదగిరిగుట్ట ఒకటి.
* స్వామి ఆవిర్భావ కాలానికి సంబంధించి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. వేల ఏళ్ల నాటి నుండి ఇక్కడ స్వామివారు  ఇక్కడ వెలిసి ఉన్నారు. అనేక పురాణాల్లో యాదగిరి స్వామి ప్రస్తావన కనిపిస్తుంది.
* యాదగిరిగుట్ట క్షేత్రంలో గుహాలయం, విష్ణుతుండం,గోపురచ్రం మహామహిమానిత్వలు అవడం ఈక్షేత్రానికి అత్యంత ప్రాశస్త్యాన్ని చేకూర్చింది. క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి.
*క్రీస్తుశకం 12వ శతాబ్దం వరకు మునులకు,యోగులకు మాత్రమే దర్శనీయమైఉన్న యాదగిరి సామాన్య మానవులకు అందుబాటులో ఉండేది కాదు. ఈక్షేత్ర మహత్యం తెలిసిన వారు కూడా తక్కువే.
* 12వ శతాబ్ధిలో రాజమహేంద్రవరం రాజాధానిగా చేసుకొని ఆంధ్ర ప్రాంతాన్ని పశ్చిమచాళుక్యులు పరిపాలిస్తుండేవారు. 1148 సంవత్సరంలో త్రిభువనమల్లుడు అనే పశ్చిమచాళుక్యరాజు రాజ్యవిస్తరణకై తెలంగాణ ప్రాంతాలో ఉన్న రాజ్యాలను జయిస్తూ ఇక్కడి భువనగిరి ప్రాంతానికి వచ్చాడు. జగదేవుడు అనే మంత్రి సలహాలను పాటించి విభువనవల్లభుడు యాదగిరిక్షేత్రం దర్శించి శ్రీలక్ష్మీనర్సింహస్వామిని ఆరాధించాడు
*శ్రీకృష్ణదేవరాయలు యాదగిరి నర్సింహస్వామి మహత్యంను విని సతీసమేతంగా స్వామిని దర్శనం చేసుకున్నట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి.
* సుమారు రెండు వందల సంవత్సరాల క్రిందట ఈ ప్రాంతంలో ఒక గ్రామ పెద్ద స్వామి వారు లలో కనిపించి యాదగిరిలో విష్ణుకుండం సమీపంలో ఒక గృహంలో ఉంటానని చెప్పి ఆదృశ్యమయ్యాడు.
గ్రామాధికారి ఆగమశాస్త్ర విధులను తెలిపిన వైష్ణవ పండితులను, అర్చకులను రప్పించి స్వామికి నిత్యం అభిషేకం, పూజ, దీపారాధన, నైవేద్యం తదితర ఉపచారాలు జరిపేందుకు నియమాకాలు చేశాడు. ఈ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు గుల్లపల్లి రామభట్టును నియమించాడు. వారి సంతతి వారే వంశపరపరంగా ఈక్షేత్రాన్ని అంటి పెట్టుకొని సేవలు చేస్తున్నారు.
*1937కు పూర్వం నైజాం ప్రభువు తమ తహసీల్దార్‌ రాజారిని చైర్మన్‌గా నియమించడంతో ఆల య అభివృద్ధికి కృషి ప్రారంభమైంది. అంతకు పూర్వం నుంచే శేషచార్యులు ఈ ఆల య పూజారిగా వ్యవహరించారు.
*యాదగిరిగుట్ట లో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతిఏటా ఫాల్గుణశుద్ధ విదియ నుంచి మొదలై ద్వాదశి వరకు పది రోజుల పాటు కన్నుల పండవగా కొనసాగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని విశేష అలంకారాలు, సేవలు నిర్వహిస్తారు. పది రోజుల పాటు జరిగే బ్రహ్మో త్సవాలలో ఎదుర్కోళ్ళు, కళ్యాణం, రథోత్సవం ముఖ్యమైనవి.  బ్రహ్మాత్సవాలలో భాగంగా స్వామి జగన్మో హిని రామ, కృష్ణ, నరసింహ అవతరాలలో భక్తులకు దర్శనమిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *