వేధిస్తున్న స్వైపింగ్ యంత్రాల కొరత

పెద్దనోట్ల రద్దుతో ప్రజల దగ్గర నగదు లేకుండా పోయింది. ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తూ కార్డుల ద్వారా చెల్లింపులు జరపాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయితే వాస్తవానికి పరిస్థితి మరో రకంగా ఉంది. దుకాణుదారుల వద్ద స్వైపింగ్ యంత్రాలు కనిపించడం లేదు. చాలా దుకాణాల్లో ఈ యంత్రాలు అందుబాటులో లేవు. తాము స్వైపింగ్ యంత్రాల కోసం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ యంత్రాల కొరత తీవ్రంగా ఉందని వారు వాపోతున్నారు. స్పైపింగ్ యంత్రాలు తగినన్ని అందుబాటులో లేకపోవడంతో అటు వినియోగదారులు, ఇటు దుకాణు దారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. స్పైపింగ్ మిషన్ ల కోసం అడిగిన తరువాత అవి చేరడానికి కనీసం నెలరోజులు పడుతోందని దుకాణుదారులు చెప్తున్నారు.
నగదు రహిత చెల్లింపుల కోసం కావాల్సిన యంత్రాల కొరత తీవ్రంగా ఉందన్న సంగతి బ్యాంకులు కూడా అంగీకరిస్తున్నాయి. డిమాండ్ కు తగ్గట్టుగా ఈ యంత్రాలను తాము సరఫరా చేయలేమని బ్యాంకులు చేతులు ఎత్తేస్తున్నాయి. దీనితో దుకాణుదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నగదు రహిత లావాదేవీలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న ప్రభుత్వం ఈ యంత్రాల లభ్యతపై కూడా దృష్టిపెట్టాలని దుకాణుదారులు కోరుతున్నారు. ఫోన్ బ్యాంకింగ్ లాంటి వ్యవస్థలు అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా మందికి వాటి ఉపయోగం పై అవగాహన రావడం లేదు. పట్టణాలు, నగరాల్లోనే ఈ వ్యాలెట్ ల వాడకం పై ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫోన్ నెట్ వర్క్ ఇబ్బందులతో చాలా సార్లు వినియోగ దారుల అకౌంట్ నుండి డబ్బులు పోయినా అవి దుకాణుదారిడి అకౌంట్ కు చేరడం లేదు. దీనితో దుకాణాల వద్ద యుద్ధాలు తప్పడం లేదు.
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం స్వైపింగ్ యంత్రాలపై కూడా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. పట్టణాలు నగరాల్లోనే పరిస్థితి ఇట్లా ఉంటే ఇక గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. తగినన్ని యంత్రాలు లేక, ఫోన్ బ్యాంకిగ్ పై అవగాహన లేక ప్రజలు అల్లాడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *