వర్మ నిజంగానే మారిపోయాడా

సంచలనాలకు మారు పేరు … వివాదాలకు కేంద్ర బిందువు అయిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మారిపోయాడా?. లేక పోతే ఇది కూడా ఒక ప్రచారపు ఎత్తుగడేనా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పిచ్చికి పరాకాష్టగా పేరుపొందిన రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. మీడియా నుండి ఫ్రీ పబ్లిసిటీని ఎట్లా తెచ్చుకోవచ్చో వర్మకు తెలిసినంతగా మరెవరకీ తెలియదు. దాజాగా జరిగిన “శివ నుండి వంగవీటి దాగా” సభలో తన నుండి ఇకపై మంచి చిత్రాలు మాత్రమే వస్తాయని చెప్పడం ద్వారా తన పైత్యాన్ని జనం రుద్దనని చెప్పాడు. నా ఇష్టం వచ్చిన సినిమాలు తీస్తాను మీ ఇష్టం వస్తే చూడడండి లేకపోతే లేదు అంటూ ప్రకటనలు ఇచ్చి తన పైత్యాన్ని జనం పైకి వదిలి దెబ్బతిన్న వర్మ ఇక నుండి బుద్దిగా ఉంటానంటూ చెప్పిన మాటలు ఎంత వరకు నిజమవుతాయో చూడాలి.

మాట మీద నిలబడే అలవాటు లేని రాంగోపాల్ వర్మ ఆ విషయాన్ని ఎప్పుడూ ఒప్పుకోవడానికి సంకోచించడు. తనకు నచ్చినట్టు ప్రవర్తిస్తానని చెప్పుకునే వర్మ చెత్త సినిమాలతో ప్రేక్షకులకు దిమ్మతిరిగేలా చేశాడు. వర్మ గ్రాఫ్ దారుణంగా పడిపోవడంతో తప్పని పరిస్థితుల్లో వర్మ తాను మారానని ఇక నుండి మంచి సినిమాలు తీస్తానని చెప్పాడా లేక ఇది కూడా మరో ప్రచారపు వ్యూహమేనా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.