వణికిస్తున్న చలిపులి

హైదరాబాద్ ను చలిపులి వణికిస్తోంది. సాధరణం కన్న తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ హైదరాబాద్ లో చలితీవ్రత ఎక్కువగా ఉంది. సాయంత్రానికే మొదలవుతున్న చలిగాలులు మద్యాహ్నం అయినా తగ్గడం లేదు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో  నగరం చలిదుప్పట్లో జోగుతోంది. ఉత్తరాది నుండి చలిగాలులు ఎక్కువగా వీస్తుండడంతో చలితీవ్రత పెరిగిందని ప్రస్తతం కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుండి 13 డిగ్రీలుగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలితీవ్రత మరో వారం రోజుల పాటు ఉండే అవకాశం ఉందని వారు వెల్లడించారు. తుపాను కారణంగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాలు పడితే చలి తీవ్రత మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందన్నారు.

చలికి వృద్దులు పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. పుట్ పాత్ లపై నివాసం ఉండే అభాగ్యులు చలికి అల్లాడుతున్నారు. చలికాలంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో వైరల్ జ్వరాలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని వీటి బారిన పడకుండా చూసుకోవాలని వైద్యులు చెప్తున్నారు.