మంత్రి గారి కామకలాపం…

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మంత్రి హెచ్.వై.మేటి పై పార్టీపరమైన చర్యలకు కూడా రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మంత్రి పదవికి మేటీ రాజీనామా చేయగా గవర్నర్ వెంటనే రాజీనామాను ఆమోదించారు. పార్టీ పరువు పోకుండా కాపాడుకోవడం కోసం గాను మంత్రిని పార్టీ పదవుల నుండి కూడా సస్పెండ్ చేయాలని బావిస్తున్నట్టు సమాచారం. తనకు అనుకూలమైన ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ చేయాలంటూ మంత్రి వద్దకు వచ్చిన మహిళపై మోటి లైంగిక దాడికి దిగాడు. దీన్ని గుర్తుతెలియని వ్యక్తులు వీడియో తీసి మీడియాకు లీక్ చేయడంతో మంత్రి గారి బండారం బయటపడింది.

మంత్రి గారి చర్యలు మీడియాలో ప్రసారం కావడంతో కర్ణాటకలో సంచలనం కలిగింది. మంత్రిపై వెంటనే చర్యలకు ముఖ్యమంత్రి సిద్ధపడ్డారు. రాజీనామా చేయాల్సిందిగా సూచించారు. దీనితో మేటీ వెంటనే రాజీనామాచేశారు. వీడియోలో మంత్రి చేష్టలు స్పష్టంగా ఉన్నప్పటికీ తానక ఏ పాపం తెలియదని తనను అనవసరంగా ఇరికించారని మేటీ అంటున్నారు. ప్రభుత్వం ఈ వీడియో వ్యవహారంపై సీఐడి విచారణకు ఆదేశించింది. మంత్రి తనపై లైంగిక దాడి చేయలేదని మొదట  ప్రకటించిన బాధితురాలు అంతలోనే మాట మార్చారు. మంత్రి అనుచరులు తనను బెదిరించడం వల్లే తాను ముందు అట్లా మాట్లాడానని అంటున్నారు. మంత్రి తనపై లైంగిక దాడి చేయడం వాస్తవమేనని అంటున్నారు.