లష్కరే కమాండర్ హతం

లష్కరే తోయిబా కమాండర్ ఒకడిని భారత భద్రతా దళాలు మట్టుపెట్టాయి. జమ్మూకాశ్మీర్ లోని సోపోర్ లో ఈ ఘటన జరిగింది. ఇక్కడ భద్రతా దళాళకు ఉగ్రవాదికి జరిగిన ఎదురుకాల్పుల్లో అబూబకర్ అనే తీవ్రవాది హతమయ్యాడు. భద్రతా ధళాల నుండి తప్పించుకోవడం కోసం సోపోర్ లోని ఒక ఇంట్లోకి జొరబడ్డ అబూబకర్ సైన్యంపై కాల్పులకు తెగబడ్డారు. ప్రతీగా భద్రతా దళాలు కాల్పులకు దిగాయి. ఇంట్లోకి దూరిన తీవ్రవాది పై కాల్పులు జరిపే సమయంలో భద్రతా బలగాలు సంయమనం పాటించాయి. ఎదురు కాల్పుల్లో అమాయకుల ప్రాణాలు పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. ఉగ్రవాది తప్పించుకునే మార్గం లేకుండా అన్ని మార్గాలను మూసివేశాయి. ఇంట్లో నుండి విచ్చలవిడిగా కాల్పులకు దిగిన లష్కరే కమాండర్ చివరకు భరత జవాన్ల చేతిలో హతమయ్యాడు. ఉగ్రవాది ఒకటే ఉన్నాడా ఇంకా ఎవరైనా ఈ ప్రాంతంలో నక్కి ఉన్నారా అని నిర్థారించుకునేందుకు భద్రతా బలగాలు ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. అణువణువు సోదాలు జరుపున్నారు.