ప్రతిష్టాత్మక ప్రాన్స్ ఫుట్ బాల్ బాల్ పత్రిక బ్యాలన్ డియోర్ ఇచ్చే అవార్డును 2016 సంవత్సరానికి గాను పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో దక్కించుకున్నాడు. ఈ అవార్డును పొందడం రోనాల్డోకు నాలుగోసారి. ఇంతవరకు అర్జెంటినా స్టార్ ఆటగాడు మెస్సీ మాత్రమే అ అవార్డును ఐదు సార్లు సాధించాడు. ఈ సంవత్సరంలో మొత్తం 54 మ్యాచ్ లు ఆడిన రోనాల్డో 51 గోల్సా చేశారు. మొదటిసారి యూరోపిన్ ఛాంపియన్ గా పోర్చుగల్ ను నిలబెట్టడంతో పాటుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న క్లబ్ రియల్ మ్యాడ్రిడ్ ను 11 సారి ఛాంపియన్ గా నిలబెట్టడంలోనూ ఈ స్టార్ స్ట్రైకర్ కీలకం గా మారాడు.
నాలుగో సారి తనకు అవార్డు లభించడం పట్ల రోనాల్డో హర్షం వ్యక్తం చేశాడు. ఈ సంవత్సరం వ్యక్తిగతంగా తాను మంచి ఫలితాలు సాధిచడం కన్నా తమ జట్టు మంచి ప్రతిభను చూపడం ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. పోర్చుగల్ మొదటి సారి యూరోపియన్ ఛాంపియన్ గా అవతరించడం తనకు ఎక్కువ ఆనందాన్ని కలిగించిందని చెప్పాడు. యూరోపియన్ ఛాంపియన్ గా నిలవడం అన్నది తమ దేశ ప్రజలు చాలా రోజులుగా కంటున్న కల అని దాన్ని తమ జట్టు నిజం చేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. తాను ప్రాతనిధ్యం వహిస్తున్న క్లబ్ కూడా ఛాంపియన్ గా అవతరించడం, తనకు అవార్డు రావడం వంటి ఘటనలతో 2016 సంవత్సరాన్ని తాను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని చెప్పారు. వ్యక్తిగా కన్నా జట్టు విజయాలు సాధించినప్పుడే ఎక్కువ ఆనందం కలుగుతుందని అన్నారు. తన జట్టులోని సభ్యులందరి సహకారంతోనే తాను మంచి ఫలితాలు సాధించగలుగుతున్నానని చెప్పారు.