రైతు రుణమాఫీ పై అపోహలొద్దు:సీఎం

రైతుల రుణ మాఫీ పథకాన్ని నాలుగు దశల్లో పూర్తి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఒక్కసారి రైతుల రుణమాఫీ పథకాన్ని అమలు  చేయడం సాధ్యం కాదని ఈ విషయాన్ని తాము మొదటి నుండి చెప్తునే ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఅర్ అన్నారు. తాము గతంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఇప్పటికే రైతుల రుణాల్లో 75 శాతాన్ని మాఫీ చేశామని మిగిలిన 25 శాతాన్ని కూడా రానున్న బడ్జెట్ లో మాఫీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం రద్దు చేసిన వ్యవసాయ రుణాలకు సంబంధించిన వడ్డీని కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని సీఎం చెప్పారు. దీనిపై ఎట్లాంటి అపోలకు తావులేదన్నారు. వడ్డీ ఎంతైనా సరే ఆ మొత్తాన్ని కట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. రైతులు ఎవరైనా వడ్డీ కట్టిన పక్షంలో ఆ వడ్డీని కూడా తాము చెల్లిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పిన ముఖ్యమంత్రి రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం అన్న సమస్యే రాదని అన్నారు.
రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ నిధులు చేరతాయని సీఎం చెప్పారు. గతంలో రు.300 కోట్లను విడుదల చేశామని మిగిలిన మొత్తం కూడా ప్రస్తుతం విడుదల చేశామని తెలిపారు. మొత్తం నిధుల విడుదల పూర్తయిందని సీఎం చెప్పారు. రైతులపై విపక్షాలు కపట ప్రేమను చూపుతున్నాయని దుయ్యబట్టారు. రైతుల సమయ్లను తీర్చడంలో తమ ప్రభుత్వం అందరికన్నా ముందుందని సీఎం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *