రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం:పోచారం

రైతులను అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోందని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో పాటుగా రైతుల కష్టాలు కన్నీళ్లను తుడిచేందుకే తాము పనిచేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి చెప్పారు.
వ్యవసాయంలో ఇన్‌పుట్ సభ్సిడి,సూక్శ్మ బింధు సేధ్యం, రుణమాఫి పథకంపై తెలంగాణ శాసనసభలో  చర్చాలో మంత్రి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించి వివరాలను వెల్లడించారు.
! గత ప్రభుత్వంలోని పెండింగ్ ఇన్‌పుట్ సభ్సిడి రూ.482 కోట్లను కూడా TRS ప్రభుత్వం వచ్చాక చెల్లించింది.
!గత ప్రభుత్వాల హయంలోని ఎర్రజొన్న బకాయిలను కూడ చెల్లించడం జరిగింది.
! రైతులను రుణవిముక్తులను చేయడానికి, వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి మొదట స్పందించేది KCR నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వమే..పోచారం.
! రైతు ఆత్మహత్యలు బాధాకరం ఎవరు కూడా దీనిని రాజకీయం చేయొద్దు. GO No.421 ప్రకారం విచారణ జరిపి ఆత్మహత్య చేసుకున్న రైతులందరికి నష్టపరిహారం చెల్లించాం- పోచారం
! 2004 నుంచి విత్తన సవరణ బిల్లు పెండింగులో ఉంది. రైతుల కోసం ‌”తెలంగాణ రైతు విన్నపాల చట్టం” తీసుకొస్తాం. మంత్రి పోచారం.
!సంక్షోభంలో పడ్డ వ్యవసాయ రంగాన్ని సంతోషకరంగా మార్చడానికి TRS ప్రభుత్వం కృషి చేస్తుంది..మంత్రి పోచారం
! నేటి వ్యవసాయ రంగం దుస్థితికి కారణం గత 60 సంవత్సరాలన పాలనే…మంత్రి పోచారం
! తెలంగాణ వస్తే చీకటే అన్నారు, కాని నేడు ముఖ్యమంత్రి పట్టుధలతో వ్యవసాయరంగానికి పగలే 9 గంటల కరంటు ఇస్తున్నాం. మంత్రి పోచారం.
!తెలంగాణలో శాశ్వత కరువు నివారణకు ప్రాజేక్టులను రీడిజైన్ చేస్తున్నాం. ఏడాదికి 25వేల కోట్లతో కృష్ణ, గోధావరి నదులపై ప్రాజెక్టులు నిర్మించి రాష్టంలోని కోటి ఎకరాల బీడు భూములకు సాగు నీరందిస్తాం.
! గత ప్రభుత్వాల హయంలో ఇన్‌పుట్ సభ్సిడి మంజూరులో తెలంగాణకు అన్యాయం జరిగింది. కరువు మండలాల ఎంపికలోను వివక్ష జరిగేది. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతులకు భీమా సౌకర్యం కల్పిస్తున్నాం- శాసనసభలో మంత్రి పోచారం.
! ప్రధానమంత్రి ఫసల్‌ భీమా యేజన పథకం మంచిదే అయినా కొన్ని అంశాలలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రైతును యూనిట్‌గా తీసుకునే సౌకర్యాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది- మంత్రి పోచారం.
! రైతులకు ఇబ్బంది లేకుండా రుణ మాఫి పథకంలో బాగంగా విడుధల చేసె నాలుగవ విడత నిధులను ప్రభుత్వమే నేరుగా బ్యాంకులకు విడుధల చేస్తుంది. కొన్ని జిల్లాలలో కొన్ని బ్యాంకులు రైతులను ఇబ్బంధులకు గురి చేస్తున్న అంశం రాష్ట్ర ప్రభుత్వం ద్రౄష్టికి వచ్చింది. దీనిని సరిచేయడానికి క్రృషి చేస్తున్నాం.
! రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ అభివ్రృద్ది కోసం నాభార్డు రూ. 874 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ నిధులతో రాష్ట్రంలో పెండింగులో ఉన్న డ్రిప్ & స్పింకర్ల ధరఖాస్తులను క్లీయర్ చేస్తాం.
.! పాలిహౌస్‌ల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం విప్లవాత్మక మార్పులు తెచ్చింది. సబ్సిడిని 50 శాతం నుండి 75 శాతంకు పెంచడం జరిగింది. రైతుకు ఎకరం పరిమితి నుండి మూడు ఎకరాలకు పెంచామని పోచారం వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *